దివంగత వైయస్ఆర్ హయాంలోనే అవినీతి...: చిరంజీవి, డి శ్రీనివాస్
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవినీతి జరిగిందని చెప్పానని కానీ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని చిరంజీవి బుధవారం చెప్పారు. చిరు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించి హైదరాబాద్ వచ్చిన అనంతరం పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఇంటికి మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. డిఎస్‌తో నాకు ఎప్పటినుండో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇకనుండి అందరం కలిసి కాంగ్రెసు పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారిస్తామని చెప్పారు.
ఇప్పటినుండి నేను కాంగ్రెసులో ఒక్కణ్ణని, ఆ కుటుంబ సభ్యులలో ఒక్కణ్ణని చెప్పారు. అందరం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. పార్టీ విలీనం ప్రక్రియ మరో నెల రోజులు పడుతుందన్నారు. ఆ తర్వాత విలీనం సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఇకనుండి కాంగ్రెసులో మా నాయకుడు, మీ నాయకుడు అని కాకుండా అందరం కలిసి ఉంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవినీతి జరిగిందని చెప్పారు. అయితే అవినీతి ఎవరి హయాంలో జరిగినా ప్రక్షాళన చేయాల్సిందేనన్నారు. కాంగ్రెసు సభ్యునిగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పట్ల రాష్ట్రంలోని అట్టడుగు బలహీన వర్గాలతో పాటు ఇరుపార్టీల కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారని డిఎస్ అన్నారు. అందరం కలిసి కాంగ్రెసు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని చెప్పారు. చిరంజీవి అందరితో ఏకమై పని చేస్తారని చెప్పారు. చిరు ఇకనుండి కాంగ్రెసు నేత అన్నారు. చిరు వైయస్ హయాంలో అవినీతి జరిగిందన్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎక్కడో ఒకచోట అవినీతి జరుగుతుందన్నారు. అయితే వాటిపై దృష్టి సారిస్తామని చెప్పారు.
Ex PRP president Chiranjeevi met PCC president D Srinivas on wednesday morning at later's residence. After meeting they talked with media. Chiranjeevi said I did not comment on late YSR personally on corruption issue. He said from today onwards we will make Congress powerful. He said he is member of Congress. All the people of state and followers of Chiru and Congress are very happy with PRP merger, PCC president DS Said.
Story first published: Wednesday, February 9, 2011, 11:05 [IST]