రాజ్యసభ సీటు రూ.20 కోట్లకు అమ్మి టీవీ కొన్నాడు: బాబుపై దగ్గుపాటి

చంద్రబాబుకు అవినీతిపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మార్ కుంభకోణంలోనూ చంద్రబాబే అధ్యుడు అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో చంద్రబాబు విల్లాలు ఉండటం అబద్దమా అని ప్రశ్నించారు. మహానాడు సమయంలో డబ్బులు వసూళ్లు చేసే వారన్నారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ నేతలనుండి డబ్బులు వసూలు చేసేవారని ఆరోపించారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ చంద్రబాబును మందలించేవారని చెప్పారు. 2009 ఎన్నికల్లో హెలికాప్టర్‌లో డబ్బులు తరలించిన ఘతన చంద్రబాబుది అన్నారు. 2004 ఎన్నికలకు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గచ్చిబౌలిలోని వెయ్యి ఎకరాల భూమిని ఐఎంజికి అక్రమంగా కేటాయించారని ఆరోపించారు. అన్ని అక్రమాలకు ఆధ్యుడు అయిన చంద్రబాబుకు అవినీతిపై ఇతరులను ఆరోపించే అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications