వైయస్ జగన్‌కు కొండా సురేఖ దంపతులు షాక్, హైకమాండ్‌తో రాజీ

రాజీకి సిద్ధపడడంతో సస్పెన్షన్ జాబితా నుంచి కొండా సురేఖ పేరును డిఎస్ తొలగించినట్లు తెలుస్తోంది. గత 15 రోజులుగా వారు జగన్‌కు అందుబాటులో లేకుండా పోయారు. వ్యాపార లావాదేవీల వల్లనే జగన్‌తో తెగదెంపులు చేసుకోలేకపోయామని సురేఖ దంపతులు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంతో పాటు వరంగల్ జిల్లాలో ఏకాకులు కావాల్సిన పరిస్థితి నెలకొనడంతో కొండా దంపతులు జగన్ వెంట వెళ్లాలనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ దంపతులకు మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో ఉన్న విభేదాలను తొలగించడానికి డిఎస్ ఆసక్తి చూపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications