ఎంపీ సీటు ఇస్తానని చిరంజీవి రూ.2 కోట్లు ముంచాడు: నర్రా

చిరంజీవి ఏ సామాజిక న్యాయం అని చెబుతూ మహాత్మాగాంధీ, అంబేడ్కర్, థెరిస్సా ఫోటోలు పెట్టుకున్నారో ఆ విగ్రహాల ముందే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానన్నారు. తనకు సీటు ఇవ్వక పోవడంతో తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని అడగటంతో పీఆర్పీ అధికారంలోకి వస్తుందని, చైర్మన్‌గానీ, ఎమ్మెల్సీ పదవిగానీ ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే పీఆర్పీ అధికారంలోకి రాకపోయినప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వలేదని చెప్పారు. చిరంజీవి రాజకీయాలలోకి వచ్చింది ప్రజా సేవ చేయడానికి కాదని డబ్బులు దోచుకోవడానికన్నారు. వారికి ప్రజా సేవ చేయడమే రాదన్నారు.
చిరంజీవి మోసంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఈమెయిల్ చేస్తానని చెప్పారు. చిరు డబ్బులు ఇవ్వకుంటే ఇకనుండి ప్రత్యక్ష యుద్ధానికి దిగుతానని చెప్పారు. డబ్బులు సంపాదించుకోవడానికే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. చిరు నాలా ఎవరినీ మోసం చేయకూడదనే బయటకు వచ్చానని చెప్పారు. పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మరింత సంపాదించుకోవచ్చునని వాళ్లు ఆలోచిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications