వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ కబడ్డీ క్రీడాకారిణిని కాల్చి చంపిన సిఆర్‌పిఎఫ్ జవాను

By Pratap
|
Google Oneindia TeluguNews

CRPF
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. తన మొబైల్ నెంబర్ ఇవ్వడానికి నిరాకరించిన జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిని ఓ సిఆర్‌పిఎఫ్ జవాను కాల్చి చంపాడు. హత్యకు గురైన 21 ఏళ్ల మనీషా దేవి రైల్వేస్ తరఫున జాతీయ మహిళా కబడ్డీ పోటీల్లో పాల్గొన్నది. ప్రాక్టిస్ తర్వాత పాట్నాలోని మొయిన్ - ఉల్ - హక్ మైదానం నుంచి ఆమె ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

మైదానం వద్ద విధులు నిర్వహిస్తున్న జస్వంత్ సింగ్ అనే సిఆర్‌పిఎఫ్ జవాను మనీషా దేవిని మొబైల్ నెంబర్ అడిగాడు. ఆమె అందుకు నిరాకరించడంతో వాదనకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న జస్వంత్ సింగ్ తన వద్ద ఉన్న ఎకె47తో ఆమెపైకి 17 రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది.

ఆమెపై కాల్పులు జరిపిన జస్వంత్ సింగ్ తనపై తాను కాల్పులు జరుపుకున్నాడు. అతన్ని పాట్నా వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. జవానుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మనీషా దేవి కుటుంబానికి తగిన సహాయం అందించడానికి వెళ్లాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ స్పోర్ట్స్ రైల్వే బోర్డును ఆదేశించింది. మనీషా దేవి తల్లిదండ్రులు హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటున్నారు.

English summary
In a shocking incident in Bihar, a CRPF jawan shot dead a national-level female Kabaddi player after she refused to share her mobile number. 21-year-old Manisha Devi, who played for the Railways, was on her way back home from Patna's Moin-ul-Haq stadium after practice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X