వైయస్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చిన తీరు, శంకర రావు లేఖ

- అక్రమ సొమ్ము మళ్లింపులతో జగతి పబ్లికేషన్స్‌ను నెలకొల్పారు.
- వై.ఎస్. హయాంలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల ద్వారా లబ్ధిపొందిన వ్యక్తులు, సంస్థలు ఈ కంపెనీలో రూ.350 ప్రీమియం చొప్పున ఒక్కో వాటాను కొనుగోలు చేసి సొమ్ము మళ్లించారు.
- గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా విల్లా ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఒక్కో షేర్‌ను రూ.350 ప్రీమియంతో కేటాయించారు.
- గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆల్ఫా గ్రూపుల కంపెనీల వ్యవస్థాపకుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు బీఓటీ పద్ధతిలో నిజాంపట్నం ఓడరేవు నిర్మాణం అప్పగించడంలో అనుకూలంగా వ్యవహరించారు.
- రాంకీ గ్రూపునకు చెందిన ఏరిస్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ జగతి పబ్లికేషన్స్‌లో 2,22,222 షేర్లను రూ.360 ధరతో కొనుగోలు చేసింది. రాంకీ గ్రూపు సంస్థకు తక్కువ ధరకు గచ్చిబౌలిలో విలువైన హౌసింగ్ బోర్డు స్థలాన్ని, విశాఖపట్నంలో సెజ్‌ను కేటాయించారు.
- హెటెరో గ్రూపునకు నక్కపల్లి, జడ్చర్ల సెజ్‌లలో 240 ఎకరాలను కేటాయించారని, ఈనేపథ్యంలో హెటెరో హెల్త్‌కేర్ లిమిటెడ్ జగతిలో 13,889 షేర్లను కొనుగోలు చేసింది.
- వైఎస్‌కు స్నేహితుడైన పి.ప్రతాప్‌రెడ్డి రోడ్ నెం.2లో నిర్మించిన స్టార్ హోటల్ అనుమతుల్లో అనుకూలంగా నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రతాప్‌రెడ్డికి చెందిన పయనీర్ ఇన్‌ఫ్రా జగతి పబ్లికేషన్స్‌లో 5,55,555 వాటాలను కొనుగోలు చేసింది.
- నాదర్‌గుల్‌లో 595 ఎకరాల కొనుగోలు వ్యవహారంలో లబ్ధిపొందిన పి.వి.పి.బిజినెస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,38,888 వాటాలను కొనుక్కొంది.
- 2008-09 ఆర్థిక సంవత్సరానికి జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ రూ. 250 కోట్ల నష్టాన్ని చూపింది. అయినప్పటికీ ఆ సంస్థలో ప్రీమియం రేటు చెల్లించి వాటాలు తీసుకున్నారు. గతంలో ప్రయోజనం పొందినందుకుగాను ప్రతిఫలంగానే ఈ పెట్టుబడులు పెట్టారు.
- జగన్‌కు చెందిన మరో కంపెనీ భారతి సిమెంట్ కార్పొరేషన్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ షేర్లు కొనుగోలు చేశారు. భారతి సిమెంటు షేర్లను 2009-10లో ప్రెంచి కంపెనీ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ పొందిన లాభాన్ని జగతి పబ్లికేషన్స్‌లో అధిక ప్రీమియానికి వాటాలు కొనుగోలు చేశారు.
- జగన్ కారణంగా గాలి జనార్దన్‌రెడ్డికి ఓబుళాపురం గనులు, బ్రహ్మణి స్టీల్ ప్లాంట్‌కు అనుమతి, ప్రైవేటు విమానాశ్రయానికి 10760 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. దీనికి ప్రతిఫలం పలు బినామీ కంపెనీల ద్వారా జగన్‌కు చేరింది. రెడ్‌గోల్డ్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్.ఆర్.గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, జగతి పబ్లికేషన్‌లు ఒకే చిరునామా కింద రిజిస్టర్ అయ్యాయి.
- సండూర్ పవర్ కంపెనీని 2001లో స్వాధీనం చేసుకున్న జగన్ 2004 వరకు 22.5 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టు చేపట్టారు. వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే కంపెనీలోకి అక్రమ పద్ధతుల్లో నిధులు తరలివచ్చాయి.
- సండూర్ కంపెనీకి సంబంధించి 82 లక్షల షేర్‌లను జగన్ బినామీ కంపెనీలైన జడ్‌ఎం ఇన్ఫోటెక్, నెల్‌కాస్ట్ ఫైనాన్స్, ఎక్సెల్ ప్రొసాఫ్ట్, సాయిసూర్య వేర్‌హౌసింగ్, సిగ్మా ఆక్సిజన్ తదితర సంస్థలకు విక్రయించినట్లు చూపారు. ఈ కంపెనీలన్నీ జగన్‌కు అనుబంధంగా ఉన్నవేనని పేర్కొన్నారు.
- హవాలా, మనీ లాండరింగ్ విధానాల ద్వారా డబ్బును మారిషస్‌కు తరలించి మళ్లీ వెనక్కి తీసుకువచ్చి జగన్ కంపెనీల్లో అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెడతారు. 2005లో మారిషస్‌కు కేంద్రంగా ఉన్న '2ఐ క్యాపిటిల్ పీసీసీ, ప్లూరి ఎమర్జింగ్ కంపెనీస్ పీసీసీలు జగన్‌కు చెందిన మొదటి కంపెనీ సాండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్‌లో రూ.61 ప్రీమియంతో రూ. 125 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అయినా ఈ కంపెనీలకు చెందిన వ్యక్తిని తమ ప్రతినిధిగా బోర్డులో ఎవరినీ నియమించలేదు. జగన్ వ్యక్తిగత ఆడిటర్ వి.ఎస్.రెడ్డి కంపెనీ బోర్డులో విదేశీ కంపెనీల ప్రతినిధిగా వ్యవహరించారు.
- దాల్మియా, ఇండియా సిమెంట్స్‌లాంటివి సర్కారు వల్ల పొందిన లబ్ధికి బదులుగా భారతి సిమెంట్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయని పేర్కొన్నారు.