వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హసన్ అలీ పారిపోకుండా చూడండి: కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన పూణేకు చెందిన వ్యాపారి హసన్ అలీ దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ పూర్తి కాకుండానే తన భార్య పేరును వాడుకుని స్విస్ బ్యాంక్ నుంచి 8 మిలియన్ల అమెరికా డాలర్లను స్వీస్ బ్యాంకు నుంచి మార్పిడి చేసిన హసన్ అలీని దేశం నుంచి వెళ్లిపోవడానికి ప్రభుత్వం అనుతించిందని రాంజెత్మాలనీ, ఇతర పిటిషనర్లు ఆరోపించారు.

దీంతో హసన్ అలీ దేశం విడిచి వెళ్లకుండా చూడాలని న్యాయమూర్తులు బి. సుదర్శన్ రెడ్డి, ఎస్ఎస్ నిజ్జార్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ గురువారం కేంద్రాన్ని ఆదేశించింది. కేసులు నమోదైన తర్వాత నల్లధనాన్ని దాచిన వారి పేర్లను వెల్లడిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎందుకు నిలబెట్టుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హసన్ అలీ దేశంలోనే ఉన్నాడని, దేశం విడిచి వెళ్లడానికి అనుమతి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

English summary
Acting on a PIL filed by eminent jurist Ram Jethmalanai and others, seeking retrieval of black money stashed in banks abroad, the SC bench of justices B Sudershan Reddy and SS Nijjar also asked the Centre to ensure that Pune-based businessman Hasan Ali, accused of money laundering, doesn't leave the country. The petitioner had claimed that the government has allowed Ali, accused of transferring USD 8 billion from a Swiss bank using wife Rheema Khan's name, to leave India even before the Enforcement Directorate's probe reached its logical conclusion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X