చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2జి స్కామ్ డబ్బులతో మాకు సంబంధం లేదు: డిఎంకె చానెల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kalaingnar Channel
చెన్నై: 2జి స్కామ్ కుంభకోణం డిఎంకె చానెల్‌ కలైంగర్‌కు చుట్టుకుంటోంది. ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబానికి చెందిన టీవీ చానెల్‌లోకి టెలికం మాజీ మంత్రి ఎ రాజా తీసుకున్న లంచం డబ్బులు పెట్టుబడిగా మళ్లాయనే ఆరోపణలు వస్తున్నాయి. 2జి స్కామ్‌లో రాజాకు 200 కోట్ల రూపాయల లంచం అందినట్లు సిబిఐ విశ్వసిస్తోంది. వాటిని కలైంగర్ టీవీలో 2009లో పెట్టుబడులుగా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ టీవీ చానెల్‌లో కరుణానిధి భార్య దయాలుమ్మాళ్‌కు 60 శాతం, కూతురు కనిమొళికి 20 శాతం వాటాలున్నాయి.

డిబి రియాల్టీ అండ్ స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ బాల్వా రాజాకు ఆ డబ్బులు లంచంగా ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజా హయాంలో విపరీతంగా ప్రయోజనం పొందిన రెండు కంపెనీల్లో ఇది ఒకటి. బాల్వాను సిబిఐ మంగళవారం ముంబైలో అరెస్టు చేసింది. డబ్బులు డిబి గ్రూప్ ద్వారా చెన్నై చేరడానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సినీయుగ్‌ను వాడుకున్నట్లు తెలుస్తోంది. సినీయుగ్ ద్వారా డబ్బులు కలైంగర్ టీవీ చానెల్‌కు చేరాయని అంటున్నారు.

అయితే, 2జి స్కామ్‌తో తమకు ఏ విధమైన సంబంధం లేదని కలైంగర్ టీవీ స్పష్టం చేస్తోంది. సినీయుగ్ తమ సంస్థలో ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టిందని, వాల్యుయేషన్ తేడా వల్ల 200 కోట్ల రూపాయలను రుణంగా పరిగణించామని, ఆ మొత్తాన్ని వడ్డీతో సహా 2009లో తిరిగి చెల్లించామని చెబుతోంది. లావాదేవీలో ఏ విధమైన అక్రమం లేదని, అన్ని నిబంధనలను పాటించామని, ఈ విషయం ఆదాయం పన్ను శాఖకు తెలుసునని వివరించింది.

English summary
The investigation into the 2G scam seems to be snaking its way to the front door of the DMK. The CBI is connecting the dots between former Telecom Minister A Raja and the companies he allegedly colluded with; the dotted line seems to suggest that the kickbacks paid to Mr Raja were routed into a TV channel owned by the first family of the DMK. The channel has, however, denied any link to the scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X