కిరణ్ కుమార్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారు: హరీష్ రావు ఆరోపణ

తాము చాలా స్పష్టంగా ఉన్నామని, కాంగ్రెసులో విలీనమయ్యే ప్రసక్తే లేదని, కాంగ్రెసుతో తాము కుమ్మక్కు కాలేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రతిపాదించరని ఆయన అడిగారు. 42 మంది శాసనసభ్యులున్నప్పుడు చంద్రబాబు అప్పటి వైయస్సార్ ప్రభుత్వంపై, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని, ఇప్పుడు 70కి పైగా శాసనభ్యులున్నా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు రావడం లేదని, కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తుండడం వల్లనే చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుతో ఎవరు కుమ్మక్కయ్యారో తేల్చుకుందామని ఆయన సవాల్ చేశారు. తాము 12 మంది శాసనసభ్యులున్నామని, అవిశ్వాసం పెట్టాలంటే 30 మంది శాసనసభ్యులు కావాలని, అందుకు తెలుగుదేశం శాసనసభ్యులు కలిసి రావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications