హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పోలవరం హరిత యాత్రపై రేవంత్ రెడ్డి మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేపట్టిన హరిత యాత్రపై తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారణమంటూ జగన్ చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జగన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రాష్టంలో అవినీతికి మూల కారకుడని ఆయన ఆరోపించారు. వైయస్సార్ వల్లనే ప్రజలపై అదనంగా ఐదు కోట్ల రూపాయల భారం పడిందని ఆయన విమర్సించారు. హరిత యాత్ర చేపట్టి ఆలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వైయస్ జగన్ తన లేఖను నింపాదిగా చదవాలని ఆయన సూచించారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వైయస్ జగన్ హరిత యాత్ర చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు. తాను సంపాదించిన కోట్లాది రూపాయలను ఇచ్చి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే కనీసం జగన్ తన నియోజకవర్గంలోనైనా గెలుస్తారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల కాలువలు మాత్రమే తవ్వి కాలువల్లో అవినీతిని పారించిన వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్‌ను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. గొర్రెకు, కుక్కకు తేడా ఏమిటో కూడా జగన్‌కు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ఇందుకు ఆయన పిట్ట కథ చెప్పారు. వైయస్ జగన్ పత్రికలను తప్పు పడితే తమకు అభ్యంతరం లేదని, కానీ తెలుగుదేశంపై బురద చల్లితే సహించబోమని ఆయన అన్నారు.

English summary
Telugudesam leader Revanth Reddy lashes out at YS Jagan's haritha yatra. He alleged that YS Jagan has earned crores of rupees misusing his father YS rajasekhar Reddy's Government. Jagan should spend his illegal earnings to complete irrigation projects in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X