హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ టీమ్: అంబటి రాంబాబు, భూమనలకు పెద్ద పీట

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పార్టీ పెట్టడానికి సమాయత్తమవుతున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వివిధ జిల్లాలకు శుక్రవారం సమన్వకర్తలను ఏర్పాటు చేశారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు కూడా సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. తన జట్టును ఏర్పాటు చేసుకున్నారు. జట్టులో అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డిలకు పెద్ద పీట వేశారు. కోస్తాంధ్ర సమన్వయకర్తగా అంబటి రాంబాబును, రాయలసీమ సమన్వయకర్తగా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. తెలంగాణకు మాత్రం సమన్వయకర్తను ఏర్పాటు చేసినట్లు లేదు. శాసనసభ్యురాలు కొండా సురేఖ మాత్రం ఈ జాబితాలో ఉన్నట్లు లేరు.

నల్లగొండ జిల్లాకు ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిని, మెదక్ జిల్లాకు కె. కె. మహేందర్ రెడ్డిని, కడప జిల్లాకు బాలరాజును, కర్నూలు జిల్లాకు నలిమిల్లి శేషారెడ్డిని, విజయనగరం జిల్లాకు అత్తిలి రంగరాజును, తూర్పు గోదావరి జిల్లాకు ఇందుకూరు రామకృష్ణ రాజును, గుంటూరు జిల్లాకు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, నెల్లూరు జిల్లాకు బాలినేని శ్రీనివాస రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు జాడ కృష్ణ మూర్తి, పశ్చిమ గోదావరి జిల్లాకు అమర్నాథ్ రెడ్డిని, విశాఖపట్నం జిల్లాకు భూమా నాగిరెడ్డిని, శ్రీకాకుళం ఆళ్ల నానిని, చిత్తూరు జిల్లాకు మేకపాటి చంద్రశేఖర రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించినట్లు సమాచారం.

కాగా, నిజామాబాద్ జిల్లాకు గోనె ప్రకాశ రావును, రంగారెడ్డి జిల్లాకు జూపూడి ప్రభాకరరావును, ఆదిలాబాద్ జిల్లాకు రెహ్మాన్‌ను, వరంగల్ జిల్లాకు బాజిరెడ్డి గోవర్దన్‌ను, మహబూబ్‌నగర్ జిల్లాకు గట్టు రామచంద్రరావును, అనంతపురం జిల్లాకు శోభా నాగిరెడ్డిని, హైదరాబాద్ జిల్లాకు జనక్ ప్రసాద్‌ను వైయస్ జగన్ సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది.

English summary
Ambati Rambabu and Bhumana Karunakar Reddy get important positions in ex MP YS Jagan's team. It is learnt that the duo were appointed as co-ordinators of Coastal Andhra and Rayalaseema respectively. Telangana co -ordinator was not appointed as Konda Surekha was in dilemma in continuing in YS Jagan camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X