రచ్చబండ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోంది: వైయస్ జగన్ ధ్వజం

YS Jagan
కడప: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మరోసారి ధ్వజమెత్తారు. రచ్చబండ పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. కడప జిల్లాలోని వేంపల్లి గ్రామంలో ఆయన శనివారం ఆర్య వైశ్యులను ఉద్దేశించి మాట్లాడారు. వైయస్సార్ స్ఫూర్తిని కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. వైయస్సార్ మరణం తర్వాత ప్రభుత్వం నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టేందుకు పూనుకుందని ఆయన అన్నారు.

కడప జిల్లాకు బోధనా ఫీజుల కోసం 114 కోట్ల రూపాయలు కేటాయిస్తే విద్యా సంవత్సరం ముగిస్తున్నా కూడా ఒక్క పైసా విడుదల చేయలేదని, దీన్ని బట్టి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. మాట, విలువలు, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవం అనే నాలుగు అంశాలపై తాను ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+