డబ్బులతో జగన్ సిఎం కావాలనుకుంటున్నాడు: టిడిపి నేత బైరెడ్డి

Baireddy Rajasekhar Reddy
కర్నూలు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అక్రమంగా సంపాదించి ఇచ్చిన డబ్బుల మూటలతో ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, ఆ ఉద్దేశ్యంలో భాగంగా ఆయన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోమవారం ఆరోపించారు. జగన్ వద్ద ఆయన తండ్రి సంపాదించి ఇచ్చిన అక్రమ మూటలు చాలా పెద్దవి ఉన్నాయన్నారు. డబ్బులతో అన్ని పనులు చేద్దామనే భావనలో ఆయన ఉన్నారన్నారు. తన వద్ద ఉన్న వేలకోట్ల రూపాయలతో ఏమైనా చేయవచ్చునని ఆయన భావిస్తున్నారన్నారు.

జగన్‌పై హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై ఇంప్లీడ్ కావాలి తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్ణయించిందని చెప్పారు. మంత్రి శంకర్‌రావు ఇచ్చిన వాటిలో చాలా వరకు మిస్ అయ్యాయని, మా వద్ద ఇంకా చాలా ఉన్నాయని వాటిని కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. మరిన్ని సాక్ష్యాలతో మేం జగన్ కేసులో ఇంప్లీడ్ అవుతామన్నారు. కడప జిల్లాలో టిడిపి మంచి ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఉప పోరులో విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ కల్లు తాగిన కోతి అని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+