ఎమ్మెల్యేలు వట్టి చేతులతో వస్తే తరిమి కొడతాం: టిఆర్ఎస్ నేత నాయిని

Nayani Narasimha Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం హామీ కోసం వెళ్లిన కాంగ్రెసు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వట్టి చేతులతో తిరిగి రావద్దని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి హెచ్చరించారు. తెలంగాణపై స్పష్టమైన హామీతో వారు తిరిగి రాకుంటే గ్రామాల్లో ప్రజలు వారిని అడుగు పెట్టనివ్వరన్నారు. హామీ లేకుండా వస్తే తరిమి కొడతామన్నారు. కేంద్రం తెలంగాణ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు.

సహాయ నిరాకరణతో కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఆయన అశాబావం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టకుంటే రాష్ట్రంలో అసెంబ్లీని, కేంద్రంలో పార్లమెంటు మావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+