ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీఆర్పీ మాజీ నేత సురేంద్రపై దాడికి ఆర్థిక లావాదేవీలే కారణం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

PRP
ఖమ్మం: మాజీ పీఆర్పీ నేత లక్కినేని సురేంద్రపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు వర్గం దాడిలో రాజకీయ కోణం కాకుండా, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. తెలంగాణ కోసం దీక్ష చేస్తున్న వనమాను పరామర్శించడానికి సురేంద్ర వచ్చినప్పుడు వనమా తనయుడి అనుచరుడు చిలుకా రవి సురేంద్రపై దాడి చేశారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని సమాచారం. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా రవి దాడి చేసినట్టు తెలుస్తోంది. కొత్తగూడెంలో ఉన్న ఓ కాంప్లెక్సు, కాంట్రాక్టులు తదితర విషయాల్లో విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

కొత్తగూడెం డిఎస్పీ సైతం దాడిలో రాజకీయ కోణం లేదని చెప్పారు. వనమా సైతం దాడిని ఖండించారు. సురేంద్ర తనకు బంధువు అని, ఆయనపై నేను ఎందుకు దాడి చేయిస్తానని చెప్పారు. దాడిలో ఏదో కుట్ర దాగి ఉందన్నారు. సురేంద్ర దీక్ష స్థలం వద్దకు వచ్చి దండ కూడా వేశారని, అ సమయంలోనే దాడి జరిగిందని చెప్పారు.

English summary
It seems, Financial issues are main reason to attack on Ex PRP leader Lakkineni Surendra today. Kothagudem DSP and Ex Minister cofirmed that issue is not related with politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X