బాబాయ్ వివేకానంద రెడ్డి వస్తానంటే స్వాగతిస్తా: వైయస్ జగన్ వెల్లడి

చిన్నాన్న కచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులతో జగన్ వాదించారు. అయితే, జగన్, వివేకాలు కలిస్తే బాగుంటుందని కొందరు కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో, ఎప్పుడైనా, చిన్నాన్న వస్తానంటే తన వర్గంలోకి, పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ చెప్పినట్లు తెలిసింది. తన పార్టీ మీదనే ఎంపీ స్థానానికైనా, ఎమ్మెల్యే స్థానానికైనా బాబాయ్‌ని నిలబెట్టేందుకు సిద్ధమేనన్నట్లు సమాచారం. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మేయర్ కడపలో రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. అయితే, తాము సాధారణంగానే కలిశామని, అంతకుమించి ప్రాధాన్యం లేదని జగన్ వర్గానికి చెందిన ఓ నాయకుడు చెప్పారు.












Click it and Unblock the Notifications