ఇన్ఫోసిస్ భవనంపై నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సాహితి ఆత్మహత్య
Districts
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: రాజధానిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య తీవ్ర సంచలనం కలిగించింది. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేస్తున్న సాహితి అనే ఉద్యోగిని గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనంపైనుండి శుక్రవారం మధ్యాహ్నం దూకి మరణించింది. 2009 నుండి సాహితి ఇన్ఫోసిస్‌లో పని చేస్తుంది. ఆమె భవనంలోని నాలుగవ అంతస్తుపైనుండి దూకి చనిపోయింది. అందరూ భోజనానికి వెళ్లిన సమయంలో ఈమె వాహనాలు పార్కింగ్ చేసే భవనం నాలుగో అంతస్తుపైకి వెళ్లి దూకి అత్మహత్యకు పాల్పడింది.
గత వారం రోజులుగా సాహితి డల్‌గా ఉంటున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే కారణాలు మాత్రం తెలియవని చెబుతున్నారు. ఆమె అత్యహత్యకు పాల్పడ్డ మరుక్షణమే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి గల కారణాలు విచారణ అనంతరం తెలుస్తాయని అంటున్నారు.