తీర్మానాల కోసం విపక్షాల పట్టు: రెండుసార్లు అసెంబ్లీ వాయిదా

అయితే దానిని నాదెండ్ల తిరస్కరించడంతో టిఆర్ఎస్ జై తెలంగాణ నినాదాలు చేసింది. టిడిపి కూడా ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో సభను రెండుసార్లు వాయిదా వేశారు. మొదటిసారి 10నిమిషాలు, రెండోసారి 30నిమిషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం టిడిపి ఫీజురీయింబర్స్‌మెంట్స్ చెల్లించాలంటూ బయట బైఠాయించింది.
మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యేలు ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే చెల్లించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అందులో 12మంది కాంగ్రెస్, 2 పీఆర్పీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా గురువారం నాటి గవర్నర్ ప్రసంగ దృశ్యాలను కొన్ని ఛానళ్లకు మాత్రమే విడుదల చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వారు ఆందోళన చేస్తున్నారు. మీడియా కమిటీ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications