హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ ఫీజు పోరు దీక్షకు టిఆర్ఎస్ పరోక్ష మద్దతు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు తెలుపుతున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఓ టీవి ఛానల్‌లో వచ్చినంత ఘనంగా కాకపోయినప్పటికీ ఇటు తెలంగాణలో ఉద్యమం తీవ్రత దృష్ట్యా, అటు సీమాంధ్రలో భావోద్వేగాల దృష్ట్యా టిఆర్ఎస్, జగన్ పార్టీ ఎంతో కొంత లాభ పడనున్న నేపథ్యంలో ఇద్దరు లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇరువురు లాభపడే పరిస్థితి కనిపిస్తున్నందునే వారు కలిసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రాంతంలో ఏ మాత్రం పట్టులేని జగన్‌కు టిఆర్ఎస్ మద్దతు ఇచ్చి ఫీజు పోరును విజయవంతం చేయాలని చూస్తున్నట్టుగా భావిస్తున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం నుండి హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జగన్ ప్రారంభించిన దీక్షకు టిఆర్ఎస్ అనుబంధ విభాగం అయిన టిఆర్ఎస్‌వి సమీకరించే బాధ్యత తీసుకున్నట్టుగా టిడిపి భావిస్తున్నట్టు సమాచారం. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతంర టిడిపిఎల్పీలో ఈ దీనిపై చర్చ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదని కూడా వారు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టుకు వచ్చిన టిఆర్ఎస్, సమైక్యాంధ్ర ఫ్లకార్డు పట్టుకున్న జగన్‌కు పరోక్ష మద్దతు పలకడానికి కారణం ఇప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయంగా బాగుపడుతామనే భావనతో ఉన్నందువల్ల అని తెలుస్తోంది.

అయితే టిడిపి, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ రాజకీయ అజెండాతో పని చేయాలని నిత్యం డిమాండ్ చేస్తూ తెలంగాణవారిని రెచ్చగొడుతున్న టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాత్రం తెలంగాణ ఎజెండాతో పార్టీ పెట్టి రాజకీయ లాభం కోసం ఇప్పుడు జగన్‌తో కలవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓ టీవీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జగన్ అధికారంలోకి వస్తాడని, కెసిఆర్ ప్రతిపక్షంగా ఉంటారని తమ సర్వేలో తేలినట్లు వచ్చిన వార్తలు కూడా శుద్ద అబద్దమని, ప్రజలను, ఆయా పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించడానికే ఇలాంటి అబద్దపు సర్వేలు చేయించుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

English summary
TRS Party is indirectly supporting Ex MP YS Jaganmohan Reddy Fee Poru, held at Indira Park, Hyderabad, allegations came. Some are thinking that TRS related student organization TRSV is gathering students for Jagan deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X