వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కోర్టుకు వెళతా: షేక్ మహబూబ్ భాషా

Kadapa dist map
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల పోటీ కోసం తీసుకుంటానని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివాదం చెలరేగుతోందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి పేరిట ఉంది. జగన్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఇంకా అనుమతి రానందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పోటీ చేయడానికి శివకుమార్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

అయితే శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదిగా చెప్పుకోవడాన్ని కడప జిల్లాకు చెందిన షేక్ మహబూబ్ బాషా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుకు సంబంధించి తాము ఇప్పటికే కోర్టులో దావా వేశామని చెప్పారు. శివకుమార్ అదే పేరుతో పార్టీ పెట్టినట్టు చెప్పుకోవడంపై కోర్టుకు వెళ్తున్నట్టు షేక్‌మహబూబ్ బాషా స్పష్టం చేశారు. తమ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే, ఇలా పార్టీ పేరు ఉపయోగించడం న్యాయ విరుద్ధమని, అందుకే కోర్టును ఆశ్రయిస్తున్నట్టు బాషా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+