జగన్ క్షమాపణ చెబితే ఆయన వెంట నడుస్తా: మంత్రి శంకర్ రావు
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్షమాపణలు చెప్పవలసిందిగా చేనేత, జౌళీ శాఖామాత్యులు శంకర్‌రావు శనివారం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపైనా, పార్టీ అధినేత్రి సోనియాగాంధీపైన, ప్రధాని మన్మోహన్ సింగ్ పైన తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు జగన్ చేశారన్నారు. అయితే వారిపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి జగన్ క్షమాపణలు చెబితే ఆయన వెంట నడిచేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.
కాగా ఎస్సీ, ఎస్టీ ఫైనాన్సు కార్పోరేషన్‌లో నిధుల గోల్‌మాల్‌పై విజిలెన్సు నివేదిక కోరుతున్నామని చెప్పారు. నిధుల గోల్‌మాల్ నిజమని తేలితే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Minister Shankar Rao demanded to Ex MP YS Jaganmohan Reddy sorry to Congress party High Command. He said if Jagan will say sorry he will be ready to go with Jagan. He confirmed that the Govenment is very stable.