తెలంగాణ జఠిలమైన సమస్య: అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ

Abhisek Singvi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం సున్నితమైన జఠిలమైన సమస్య ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమస్య ఇప్పటికిప్పుడు తీరేది కాదన్నారు. తెలంగాణ సమస్య దశలవారీగా పరిష్కరించడానికి నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కేంద్రం తెలంగాణ సమస్య గురించి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆందోళనలు సరికాదన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం లేదని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలియజేయడం, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రతి ఆందోళనకు ఓ సమయం, సందర్భం ఉంటుందని చెప్పారు. ఎంపీల ఆవేదనను మేం అర్థం చేసుకున్నామని చెప్పారు. అయితే సభా మర్యాదలు పాటించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+