జై తెలంగాణ అనకుంటే జగన్‌నూ అడ్డుకుంటాం: హరీష్ రావు

అసెంబ్లీలోనే కాకుండా అసెంబ్లీ చుట్టుపక్కల పూర్తిగా పోలీసులతో దిగ్బంధం చేశారని, ఇలా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపించేలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం అయిన గన్ పార్కు వద్దకు ప్రజలను స్వేచ్ఛగా వెళ్లేందుకు కూడా వెళ్లనివ్వడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్నారు. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజల చేతుల్లోకి పోయిందని చెప్పిన వారు టిఆర్ఎస్‌పై అబాండం వేయడం ఏమిటని ప్రశ్నించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వరంగల్ వచ్చినప్పుడు అడ్డుకున్నామని, అయితే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరని, ఎంపీ కాదని, ఆయన పార్టీ కూడా పెట్టలేదని అందుకే ఇప్పుడు ఆయనను అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయన పార్టీ పెట్టి జై తెలంగాణ అనకుంటే అప్పుడు అడ్డుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications