హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయకుడే కారా?, ధ్వజమెత్తిన వివిధ పార్టీల నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడే కారని కాంగ్రెసు నాయకుడు, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కన్నా పార్టీని కాపాడుకోవడమే ముఖ్యమని అంటున్న చంద్రబాబు అసలు నాయకుడే కారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించకపోతే చంద్రబాబును ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు మిలాఖత్ అయ్యాయని అనడం అర్థరహితమని ఆయన అన్నారు.

కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జగన్‌పైకి తెలంగాణవాదులను రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇది నీచ రాజకీయమని ఆయన అన్నారు. తెరాస నాయకుడు జగదీశ్వర్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి చంద్రబాబు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌తో, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుతో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబు తన వ్యతిరేక వైఖరిని మరోసారి ప్రదర్శించుకున్నారని ఆయన విమర్శించారు.

ఇదిలా వుంటే, చంద్రబాబు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని అనుకుంటుండడంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఆయన పరుష పదజాలం వాడారు. తాను చెప్పేది వినాలని ఆగ్రహించారు.

English summary
Congress leader Mallu Bhatti Vikranarka lashed out at TDP president Chandrababu. He said that he is not recognising Chandrababu as a political keader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X