హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు పరిష్కారం కన్నా పార్టీ రక్షణకే చంద్రబాబు ప్రాధాన్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరు ఏ మాత్రం మారలేదు. తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని తమ పార్టీ సీమాంధ్ర శానససభ్యులు ప్రయత్నాలు సాగిస్తున్నా ఆయన ఏ మాత్రం మారడానికి సిద్ధంగా లేరని అర్థమవుతోంది. దీనిపై మీడియా ప్రతినిధులు మంగళవారం ప్రస్తావించినప్పుడు ఆయన అసహనానికి గురయ్యారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడం తనకు ముఖ్యమని అంటూ అందువల్ల తాను తెలంగాణపై కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించలేనని ఆయన చెప్పకనే చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు, సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా సీమాంధ్ర ప్రాంత నాయకులు వ్యవహరిస్తున్నారు. అందుకు తాను వారికి అనుమతిచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారం కావడం కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన చాటుకున్నారు. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగానే చెప్పారు.

మిగతా పార్టీలు పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, అటువంటప్పుడు తామెందుకు ఆ ప్రయత్నాలు చేయకూడదని ఆయన అన్నారు. పార్టీని కాపాడుకోవడానికే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రదర్సించదలుచుకోలేదనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలంటూ పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తే సహించేది లేదని ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు శాసనసభను స్తంభింపజేస్తుంటే ఆయన చూస్తూ కూర్చుంటున్నారు. సీమాంధ్ర శాసనసభ్యులను మాట్లాడనివ్వడం లేదనే విమర్శ వస్తోంది. మొత్తం మీద, భారమంతా కేంద్రంపైకి నెట్టేసి ఆయన పార్టీని కాపాడుకునేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతోంది.

English summary
TDP president Chandrababu is not ready to change his working style. He is allowing to opinions to prevail in party on Telangana issue. He said that it is important to protect party interests than solving Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X