సూపర్ టేస్టీ బ్రెడ్ హల్వా.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!
పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే స్వీట్ రెసిపీల్లో హల్వా ఒకటి. బ్రెడ్ తోనే కాదు ఈ హల్వాల్లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వీట్ ను ప్రిపేర్ చేసుకుంటారు. అందులో బ్రెడ్ హల్వాను చాలామంది ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కూడా ఈజీనే. మరి ఈ సూపర్ టేస్టీ బ్రెడ్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
బ్రెడ్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బ్రెడ్ ముక్కలు ఆరు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్ లు, పాలు రెండు కప్పులు, చక్కెర ముప్పావు కప్పు లేదా రుచికి సరిపడా, కండెన్స్ డ్ మిల్క్ పావు కప్పు, యాలకుల పొడి అర టీ స్పూన్, కేసరి కొద్దిగా, జీడిపప్పు 10 నుంచి 12, బాదం ఎనిమిది నుంచి పది, పిస్తా ఒక టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష ఒక టేబుల్ స్పూన్, పాల పొడి ఒక టేబుల్ స్పూన్, గోధుమ రంగు ఫుడ్ కలర్ కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే..

ముందుగా బ్రెడ్ ముక్కల్ని అంచులు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా చేతితో మెత్తగా చేయాలి. ఇప్పుడు గిన్నెలో నెయ్యి వేసి వేడి చేసి అందులో జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేసి బంగారం రంగు వచ్చే విధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత పక్కకు తీసి పెట్టాలి. ఇప్పుడు అదే గిన్నెలో మిగిలిన నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు పాలు పోసి మెల్లగా వేయించుతూ ఉండాలి. బ్రెడ్ పాలను పీల్చుకునేంత వరకూ వేయించుకోవాలి.
చక్కెర, కండెన్స్ డ్ మిల్క్, యాలకుల పొడి, కేసరి వేసి బాగా కలపాలి. అలా మిశ్రమం గట్టిగా అయ్యేంత వరకూ వేయించుతూ ఉండాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ , పాల పొడి, ఉప్పు చిటికెడు కలిపి మరో రెండు నిమిషాలు కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయినట్టే.. మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి..












Click it and Unblock the Notifications