హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ టిఆర్ఎస్ పరస్పర సహకారం: టిడిపి అధినేత చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మాజీ పార్లమెటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా తొందరపాటు చర్యలు తీసుకుంటుందన్నారు. ఏదో ఒక నెపంతో సభను వాయిదాల మీద వాయిదా వేస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్సు, పోలవరం, చేవెళ్ల-ప్రాణహిత తదితర ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక బట్టి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి స్పష్టంగా టిడిపి చెప్పిందన్నారు. కమిటీ నివేదికపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి, రాష్ట్రంలో బందులు తదితర పరిణామాలన్నింటికీ కాంగ్రెసు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగువారి కోసమన్నారు. కేవలం రాష్ట్రంలోని వారి కోసమే కాదని, ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగక పోవడం విచారకరమన్నారు. సమస్యలను దాటవేసే ధోరణిలో ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. బాధ్యతను విస్మరించి కేంద్రం ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. చర్చలేకుండా తీర్మానం ఆమోదించే పద్దతికి అధికార పక్షం శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్రం కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు స్థంభిస్తున్నాయి. పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. కొంతమందికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయన్నారు. అయితే అవి పార్టీ అభిప్రాయాలు కావాల్సిన అవసరం లేదన్నారు.

English summary
TDP President Chandrababu Naidu said Ex MP YS Jaganmohan Reddy and Telangana are going with mutual co-operation. He said Telangana is in Central Government court. He blamed Kiran Kumar Reddy government for disruption of assembly session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X