అసెంబ్లీ మూడుసార్లు వాయిదా: తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన సభ

అంతకుముందు టిఆర్ఎస్, బిజెపితో పాటు తెలంగాణకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని, విద్యార్థులపై కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని తదితర తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అయితే చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పిన తర్వాత మిగతా వాటిపై నిర్ణయం తీసుకుందామని చెప్పినప్పటికీ సభలో గందరగోళం ఆగలేదు. కాగా సభ సజావుగా నడవక పోవడంతో తెలంగాణపై తీర్మానం ప్రవేశ విషయంలో చర్చించేందుకు సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టే అవకాశముందని భావించి, తెలంగాణ తీర్మానంపై ఓ నిర్ణయానికి వారు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Comments
English summary
Deputy Speaker Nadendla Manohar adjourned three times assembly on tuesday. Telangana MLAs gave slogans against government on Telangana issue. They demanded government to propose Telangana resolution.
Story first published: Tuesday, February 22, 2011, 14:21 [IST]