తెలంగాణలో పరిస్థితికి చంద్రబాబు, సోనియాగాంధీ కారణం: కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ప్రక్రియ ప్రారంభించకుండా అణిచివేయడం ఎంత వరకు సమంజసం అని ప్రదర్శించారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తుంటే ప్రభుత్వానికి మాత్రం అది కనిపించడం లేదన్నారు. ప్రపంచంలో అనేక ఉద్యమాలు చూశామని, అన్ని ప్రజా ఉద్యమాలు విజయం సాధించాయన్నారు. రాష్ట్రంలో జెఏసి ఇచ్చిన 48 గంటల బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరుగుతుందన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే మాత్రం సరికాదన్నారు. బంద్‌కు అందరూ సహకరించాలన్నారు. తెలంగాణవ్యాప్తంగా బంద్ జరుగుతుంటే కేవలం పోలీసుల డిపార్టుమెంట్ మాత్రమే ఓవర్ యాక్షన్ చేస్తుందన్నారు. సిఎం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం పోలీసు డిపార్టుమెంట్ ఒక్కటే పని చేస్తుందన్నారు.