అందుకే తెలుగుదేశం అధ్వాన్నంగా ఉంది: ఎంపీ లగడపాటి

కేంద్రమంత్రి చిదంబరం గత డిసెంబర్ 9న కేంద్రం తరఫున ప్రకటన చేయలేదన్నారు. రాష్ట్ర పార్టీలు తెలంగాణపై చేసిన నిర్ణయానికి ఆమోదపూర్వక ప్రకటన మాత్రమే అని చెప్పారు. చంద్రబాబు నిత్యం ప్రకటన ఆర్ధరాత్రి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారని, అయితే ప్రకటన ఎప్పుడు చేస్తే ఏమిటని, అది సరైనదా, కాదా నిర్ణయం చెప్పాలని ప్రశ్నించారు. తెలుగుదేశం పేరుకే సార్థగత లేకుండా పోతోందన్నారు. తెలంగాణ కోసమో మరెందుకోసమో ఒక్కరు రాజీనామా చేస్తే సరిపోదన్నారు. కులం, మతం, ప్రాంతం బేధాలు తనకు లేవన్నారు. 2014 ఎన్నికల వరకు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకి వస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్సు గురించి ప్రశ్నిస్తున్నవారు గత రెండేళ్లనుండి తమకు ఫీజులు చెల్లించలేదని ఏ విద్యార్థి అయినా అడిగారా అని, ప్రతిపక్షాల సృష్టి అని చెప్పారు.












Click it and Unblock the Notifications