వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూజిలాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపం, విధ్వంసం

భవనాలు కూలి వీధుల మీద పడ్డాయి. రోడ్లు పగుళ్లు వారాయి. క్రిస్ట్ చర్చి మేయర్ బాబ్ పార్కర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు నగరాన్ని వదిలి వెళ్లాలని ఆదేశించారు. నగరానికి ఇది బ్లాక్ డే అని ఆయన వ్యాఖ్యానించారు. విమానాశ్రయాన్ని మూసేశారు. క్రిస్ట్ చర్చి ఆస్పత్రిని ఖాళీ చేయించారు. విద్యుత్తు, టెలిఫోన్ లైన్లు తెగిపోయాయి. పైపులు పగిలిపోయాయి. నీళ్లు వీధుల్లో ప్రవహిస్తున్నాయి. కార్యాలయాలపైకి చాలా మంది చేరుకున్నారు. వారిని దింపడానికి ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. ప్రజలు కార్యాలయాలకు, పనులకు వెళ్తున్న సమయంలో భూకంపం సంభవించింది.