తెలంగాణ అంశం: చంద్రబాబుపై సీమాంధ్ర ఎమ్మెల్యేల ఒత్తిడి

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తీసుకు వచ్చే యోచనలో సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు సజావుగా సాగట్లేదని, సమావేశాలు సజావుగా సాగాలంటే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు పట్టుపడుతున్నట్లుగా తెలంగాణ తీర్మానం ప్రవేశ పెడితే సరిపోతుందని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి తీర్మాం ప్రవేశ పెడితో పోయేదేమీ లేదన్నారు. తెలంగాణ అంశంపై సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ అయ్యి చర్చించారు.

అయితే తీర్మానానికి చంద్రబాబు ఏమాత్రమూ సుముఖంగా ఉండడని, కాబట్టి బాబుపై ఒత్తిడి తీసుకు వచ్చి అయినా తీర్మానం ప్రవేశ పెట్టాలని వారు యోచిస్తున్నారు. సీమాంధ్ర ఎంపీలు ఒత్తిడి మేరకు చంద్రబాబు తీర్మానానికి సరే అంటే ఆయన ఇరుక్కు పోతారు. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడితే మా పార్టీ మద్దతు ఉంటుందని ఆయన గతంలో ప్రకటించారు. తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత పార్టీ మద్దతు ప్రకటించకుంటే ఇప్పటికే తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన టిడిపికి మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంగా చంద్రబాబు తీర్మానానికి మొగ్గు చూపకపోవచ్చు కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+