లక్షా 28వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రతిపాదించిన ఆనం
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: రూ. లక్షా 28 వేల 542 కోట్లతో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం శానససభలో 2011 - 12 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ప్రతిపక్ష సభ్యులు తెలంగాణ నినాదాల మధ్యనే ఆయన బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆందోళనకు దిగిన తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, బిజెపి సభ్యులను సభ నుంచి ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు. ప్రణాళిక వ్యయం 47,558 కోట్ల రూపాయలు, ప్రణాళికేతర వ్యయం 80, 984 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ ఆదాయం మిగులు రూ. 3,826 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్యలోటు 17,600 కోట్లు ఉందని చెప్పారు. స్థూల రాబడి 20 శాతం అధికంగా ఉంటుందని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
రాష్ట్రంలో నాలుగు సార్లు భారీ వర్షాలు, తుఫాను వచ్చినా వ్యవసాయంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి సాధించామని ఆయన చెప్పారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, వైయస్సార్ అభయ హస్తం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. జలయజ్ఞానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 15,040 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాయితీ బియ్యం పథకానికి 2500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. పనిదినాలను వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నట్లు మంత్రి చెప్పారు.
Finance Minister Anam Ramanarayana Reddy presented 2011-12 annual budget in assembly today with Rs 1,28,542 crores. He promised that welfare schemes like Rs 2 KG rice, Arogyasri will be continued.
Story first published: Wednesday, February 23, 2011, 12:28 [IST]