మంత్రి బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే కొండా సురేఖ మండిపాటు

జగన్ దీక్షను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. వైయస్ జగన్ దీక్షపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులపై, వైయస్ జగన్‌పై, వైయస్ జగన్ వర్గంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సురేఖ పాదయాత్ర సందర్భంగా అన్నారు. ఓ ప్రతినిధిని పంపి దీక్ష విరమించాలని కోరే కనీస సంప్రదాయాన్ని కూడా ప్రభుత్వం పాటించడం లేదని, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications