శాసనసభలో ఈ రోజూ అదే తంతు, తెలంగాణ అంశంపై వాయిదా

సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా తెరాస సభ్యులు తమ పట్టు వీడలేదు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. నాదెండ్ల మనోహర్ ఎంతగా సర్ది చెప్పినప్పటికీ వారు వినలేదు. దీంతో సభను డిప్యూటీ స్పీకర్ రెండో సారి అర గంట పాటు వాయిదా వేశారు. ఈ నెల 17వ తేదీన సభా సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
గవర్నర్ నరసింహన్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో తీవ్రమైన ఆందోళన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెరాస శాసనసభ్యులను సస్పెండ్ చేసి సభలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్‌ను ప్రతిపాదించానని అనిపించారు. తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించే వరకు సభను కొనసాగనివ్వబోమని తెరాస ఇప్పటికే ప్రకటించింది. కాగా, తెలంగాణ ప్లకార్డులతో కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications