తెలంగాణ కేసులో చంద్రబాబు అప్రూవర్‌గా మారాలి: కెటి రామారావు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్రూవర్‌గా మారాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు నేరాంగీకారం చేసి అప్రూవర్‌గా మారాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత అనిశ్చితికి చంద్రబాబే కారణమని ఆయన విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెసు పార్టీది సింహభాగమని, అయితే ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యకు తానే కారణమని చంద్రబాబు అంగీకరించి కాంగ్రెసును దోషిగా నిలబెట్టాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి శాసనసభలో అవిశ్వాస తీర్మానం రాకుండా చూసుకుంటున్నాయని ఆయన విమర్శించారు.
TRS MLA KT Ramarao makes wild comments against Telugudesam president N Chandrababu Naidu for anti
Telangana stand. He demanded Chandrababu to apologise to Telangana people.
Story first published: Saturday, February 26, 2011, 14:50 [IST]