సోనియాగాంధీకి ధైర్యం ఉంటే జగన్‌పై సిబిఐ ఎంక్వయిరీ: యనమల
Districts
oi-Srinivas G
By Srinivas
రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వయిరీ వేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. జగన్ అక్రమాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన జగన్‌పై వెంటనే సిబిఐ ఎంక్వయిరీ వేయాలన్నారు. టిడిపి మొదటినుండి జగన్ అక్రమాస్తులపై ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకు వెళుతుందన్నారు.
TDP senior leader Yanamala Ramakrishnudu demanded AICC president Sonia Gandhi to CBI enquiry on Ex MP YS Jaganmohan Reddy corruption on sunday in rajahmundry.