వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగదు బదిలీ ద్వారా సబ్సిడీలు, ప్రత్యక్ష పన్నులు సరళతరం: ప్రణబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: పేదలకు కిరోసిన్, వంటగ్యాస్, ఎరువుల సబ్సిడీలను నగదు బదిలీ ద్వారా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఈ విషయం చెప్పారు. 2012 ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పన్నుల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తున్నామని, పన్నుల విధానాన్ని సరళతరం చేసేందుకు చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. టోకు, రిటైల్ ధరల మధ్య తేడాను తగ్గిస్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాది 40 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని ఆయన చెప్పారు.

మహిళా స్వయం సహాయక గ్రూపులకు అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ గృహ నిర్మాణ నిధిని 3 వేల కోట్లకు పెంచుతామని ఆయన చెప్పారు. కొత్త బ్యాంకుల అనుమతికి మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రతిపాదించడం ప్రారంభించగానే సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగింది. రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తే రైతులకు 3 శాతం రాయితీ ఇస్తామని ఆయన చెప్పారు.

English summary
Pranab Mukherjee said that Cash transfer of subsidy on kerosene, LPG, fertilizer to BPL people will be implemented. He said that Direct tax code to be implemented from April 1, 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X