హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ సిఎం రోశయ్యను వీడని అమీర్‌పేట భూమి కేటాయింపు కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: హైదరాబాదులోని అమీర్‌పేట భూమి కేటాయింపు వివాదం మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యను వదలడం లేదు. రోశయ్యపై, మరో 14 మందిపై కేసు నమోదు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు ఇచ్చిన తీర్పుపై విధించిన స్టేను రాష్ట్ర హైకోర్టు సోమవారం ఎత్తేసింది. రోశయ్యపై, మరో 14 మందిపై అమీర్‌పేట మైత్రీవనం భూమి కేటాయింపుపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైకోర్టు ఎసిబి కోర్టును ఆదేశించింది. దీంతో రోశయ్యకు కష్టాలు తప్పేట్లు లేవు.

అత్యంత విలువైన అమీర్‌పేటలోని మైత్రీవనం భూమిని రోశయ్య నామమాత్రం ధరకు కేటాయించారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది ఎసిబి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రోశయ్యపై, మరో 14 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎసిబి కోర్టు ఇంతకు ముందు నిర్ణయించింది. దీనిపై నిందితులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఎసిబి కోర్టు నిర్ణయంపై హైకోర్టు ఇంతకు ముందు స్టే విధించింది. తాజాగా సోమవారం ఆ స్టేను ఎత్తేసింది.

English summary
High Court today lifted stay on ACB court decision to book case against Ex CM Rosaiah in the issue of land allotment at Ameerpet of Hyderabad. High court order to book case against Rosaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X