హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో తెలంగాణ గొడవ: శ్రీధర్ బాబుపైకి దూసుకెళ్లిన కొత్తకోట

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: తెలంగాణ అంశంపై సోమవారం కూడా శాసనసభ దద్ధరిల్లింది. కాంగ్రెసు, తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అది ఉద్రిక్తతకు దారి తీసింది. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపైకి తెలుగుదేశం శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి దూసుకెళ్లారు. ఆయనను కాంగ్రెసు సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యకు ఆగ్రహం చెందిన దయాకర్ రెడ్డి ఆ చర్యకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని, తెలంగాణను అడ్డుకున్నది ఎవరో బిజెపి అగ్రనేత అద్వానీ చెప్పారని ఆయన అన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అయితే, తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. వారికి సిపిఐ సభ్యులు మద్దతు పలికారు. ఇప్పటి వరకు శాసనసభా కార్యక్రమాలను అడ్డుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు సోమవారం సభకు రాలేదు. వారి పాత్రను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు పోషించారు. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జోక్యం చేసుకుని - తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా నెపాన్ని తమపైకి నెడుతోందని ఆయన అన్నారు. రాజధాని తెలంగాణలో ఉన్నందున రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదని అద్వానీ చెప్పారని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులు వారి వారి ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది. సభ సద్దుమణగకపోవడంతో ఉప సభాపతి మనోహర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

English summary
Assembly adjourned for 15 minutes without taking any business, as proceedings stalled by Congress Telangana region MLAs and CPI members. At this juncture war of words took place between Congress and TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X