తీరప్రాంతమంతా ఒక్కరికే కట్టబెట్టారు: జయప్రకాష్ నారాయణ
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: బంగాళాఖాతం తీరంలో 348 కిలో మీటర్ల ప్రాంతాన్ని రాష్ట్రప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఒకే గ్రూపునకు కట్టబెట్టిందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టుకు 153 కి.మీ., వ్యాన్‌పిక్‌కు 92 కి.మీ., మచిలీపట్నం పోర్టుకు 103 కి.మీ. తీరప్రాంతాన్ని కట్టబెడుతూ రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కురుర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఓడరేపు, నౌకా నిర్మాణ కేంద్రాలకు ఆటంకం కలుగుతుందని జేపీ అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణకు తాము అడ్డుకాదని ఆయన తెలిపారు. అయితే ప్రైవేటీకరణ పేరుతో దోపిడీవిధానాన్ని అడ్డుకోవాలని తాము యత్నిస్తున్నామని వివరించారు. 2జీ స్పెక్ట్రంకంటే ఇదేమీ తక్కువ కుంభకోణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Loksatta president Jayaprakash narayana opposed the allotment of coastal belt to single company. He alleged that the allotment is not fair and it is against the law.
Story first published: Monday, February 28, 2011, 15:02 [IST]