హైదరాబాదు నుంచి సీమాంధ్రులను తరిమికొడ్తాం: కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తే సీమాంధ్ర నాయకులను హైదరాబాదు నుంచి తరిమికొడ్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు హెచ్చరించారు. ఆ పరిస్థితిని సీమాంధ్ర రాజకీయ నాయకులు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నాయకులు పద్ధతి మార్చుకోకపోతే హైదరాబాదు నుంచి తరిమికొట్టే పరిస్థితి వస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీమాంధ్ర నాయకుల వైఖరి వల్ల తెలంగాణలో ఆవేశాలు కట్టలు తెచ్చుకుంటే ఏ పరిణామాలైనా సంభవించవచ్చునని ఆయన హెచ్చరించారు.

కలిసి ఉండాలనే బలవంతపు ఆరాటాన్ని సీమాంధ్ర నాయకులు మానుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణను అపే కుట్రలు చేస్తూ ఇక్కడి ఆంధ్ర, రాయలసీమ సామాన్య ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టవద్దని ఆయన అన్నారు. అవసరమైతే ఈ నెల 5వ తేదీన కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు నివాసంలో జరిగే కాంగ్రెసు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. 2009 డిసెంబర్ 7వ తేదీన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలమని అన్ని పార్టీలు చెప్పిన తర్వాత డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారని, ఆ ప్రకటన అమలును అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నాయకులు ఏకమైన సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నాయని, దాంతో తెలంగాణ భగ్గుమందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+