వైయస్ జగన్ టార్గెట్, కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కు: సాక్షి డైలీ

చంద్రబాబు నిత్యం ఏదో సందర్భంలో సాక్షిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని, ఇటీవలి కాలంలో ఆయా ప్రజా సమస్యలపై జగన్ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబుతో పాటు అధికార పార్టీ కూడా ఆయనపై కక్ష కట్టిందని అంతా భావిస్తున్నారని వ్యాఖ్యానించింది. తమ పార్టీకి రాజీనామా చేసిన జగన్‌ను ఎలాగైనా అప్రతిష్ట పాలు చేయాలని కాంగ్రెస్ నేతలు కొందరు భావిస్తున్నారని ఆరోపించింది. అధికార, ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని, ప్రజా సమస్యలను పరిష్కరించడం పక్కనబెట్టి, జగన్‌ను జనంలో పలుచన చేయాలన్నదే లక్ష్యంగా కలిసి కృషిచేస్తున్నాయని, ఎల్లో మీడియా దుష్ర్పచారాన్ని అడ్డుకోవడమే కాకుండా ప్రజలు సాక్షిని ఆదరించడంతో తట్టుకోలేని శక్తులన్నీ ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయని వ్యాఖ్యానించింది.
ఇటీవలి కాలంలో నీల్సన్ జరిపిన సర్వేలో కూడా జగన్ పట్ల ప్రజల ఆదరాభిమానాలు వ్యక్తం కావడం ఏమాత్రం రుచించని నేతలు తమ రాజకీయ అవసరాల కోసం మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని మరీ ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారని సాక్షి డైలీ వ్యాఖ్యానించింది. ఐటీ శాఖ సాక్షికి అసెస్‌మెంట్ ఆర్డర్ ఇస్తే అదే తుది తీర్పు అయినట్టు రాద్ధాంతం చేయడం వల్ల ఒక్క టీడీపీకే కాదు కాంగ్రెస్ కూడా రాజకీయ ప్రయోజనాన్నే కోరుకుంటోందని అర్థమవుతోందని అభిప్రాయపడింది. నిజానికి పెట్టుబడులకు సంబంధించి ఆదాయం పన్ను శాఖ జారీ చేసిన నోటీసులకు సాక్షి సమాధానం ఇచ్చిందని, కొన్ని పత్రికలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం ఆధారంగా నోటీసులు జారీ చేశారన్న విషయం కూడా సాక్షి తన సమాధానంలో స్పష్టంగా పేర్కొందని సాక్షి డైలీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications