తెలంగాణ కోసం ఉద్యమించాలంటూ వెలసిన మావోల పోస్టర్లు!
Districts
oi-Srinivas G
By Srinivas
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మండలం గన్నవరం, తోటపల్లి గ్రామాల మధ్యలో మావోయిస్టుల పోస్టర్లు బుధవారం వెలిశాయి. ఆ పోస్టర్లలో మావోయిస్టులు తెలంగాణకు, మహిళా దినోత్సవానికి అనుకూలంగా ప్రకటనలు చేసినట్టుగా తెలుస్తోంది. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆ పోస్టర్‌లో కోరినట్టుగా తెలుస్తోంది. ప్రతి మహిళా రాజకీయంగా ఎదగాలని వారు అందులో కోరారు. ప్రతి మహిళా రాజకీయ శక్తిగా ముందుకు రావాలని సూచించారు.
అలాగే తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా పోరాడాలని పోస్టర్‌లలో కోరారు. తెలంగాణ సాధించుకునేందుకు అందరూ ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మావోయిస్టులు అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.