హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు! వివరణ ఇవ్వు: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీకృష్ణ కమిటీ నివేదికను అనుసరించి కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని సమైక్యాంధ్రను ఉంచాలని ప్లకార్డులు ప్రదర్శించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే వివరణ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు గంగాపురం కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గత 2009 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం రెండుకళ్ల సిద్ధాంతం అంటూ వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం పేరుతో తెలంగాణ ప్రజలకు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. వారి రెండు కళ్ల సిద్ధాంతం అర్థం లేనిదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటపైన తెలుగుదేశం పార్టీ వెనుకడుగు వేసిందని అన్నారు. చంద్రబాబు తీరు, టిడిపి వైఖరి చూస్తుంటే అవకాశవాద వైఖరి అవలంభిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబు తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాగా ఈ నెల 10వ తేదిన మిలియన్ మార్చ్ సందర్భంగా ఇంటర్మీడియేట్ బోర్డు పరీక్షలను వాయిదా వేయాలన్నారు. ఆ రోజు తెలంగాణలోని పది జిల్లాలనుండి పదిలక్షలమంది ప్రజలు హైదరాబాద్‌ను దిగ్బందిస్తారన్నారు. కాబట్టి ఇంటర్ బోర్డు ఆ రోజు జరగనున్న ఇంగ్లీష్ పేపర్‌ను మరో రోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

English summary
BJP MLA Kishan Reddy demanded TDP president Chandrababu clarification on United Andhra Pradesh placards today. He accused Chandrababu went in 2009 election with Telangana slogan, but now he left his slogan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X