తెలంగాణ మిలియన్ మార్చ్ వాయిదా: 12 లేదా 13 ఖరారు?

దీనిపై తీవ్రంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మిలియన్ మార్చ్‌ని మార్చి 12వ తేదికి గానీ, 13వ తేదికి గానీ వాయిదా వేసుకునేందుకు నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మిలియన్ మార్చ్‌ను వాయిదా వేయాలని భారతీయ జనతా పార్టీ ముందునుండి కోరుతున్న విషయం తెలిసిందే. జెఏసి కోరికను బిజెపి సున్నితంగా తిరస్కరించడంతో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మిలియన్ మార్చ్ దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయించుదామని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి నచ్చజెప్పడంతో బిజెపి కూడా పాల్గొనడానికి సిద్ధపడింది. అయితే సిబిఎస్ఇ పరీక్షల దృష్ట్యా వాయిదా పడే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications