తెలంగాణ ఎఫెక్ట్: వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు వాయిదా

పార్టీ పెడితే తెలంగాణపై ఏదో ఒక వైఖరిని వెల్లడించాల్సి వస్తుంది. దాన్ని తప్పించుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నారు. దీంతోనే పార్టీ స్థాపనను ఆయన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో పార్టీని ప్రకటించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో వ్యతిరేకత ఎదురవుతుందని, వ్యతిరేకంగా తీసుకుంటే తెలంగాణలో ప్రవేశించడం కష్టమవుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికే ఆయన ప్రయత్నిస్తున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాను బయట పడడానికి వీలవుతుందని అంటున్నారు.