హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై స్పందించకుంటే మెరుపు సమ్మె: టిఎన్‌జెఏసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే తాము మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఏసి గురువారం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ బడ్జెట్ సమావేశాలలో కేంద్రం తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. టిఎన్‌జెఏసి కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు గురువారం భేటీ అయ్యాయి. భేటీ తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ముందు తాము కొన్ని ప్రతిపాదనలు ఉంచామని ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం సరే అంటే సహాయ నిరాకరణ విరమించుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వం ఎవరికైనా జీతాలు ఇస్తామంటే అడ్డుకుంటామని మేం అనలేదని అన్నారు. ప్రభుత్వం జీతాలు ఇచ్చుకోవచ్చునని చెప్పారు. అయితే మాకు జీతాల కన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమని చెప్పారు. సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నట్టు ఏక వ్యాఖ తీర్మానం చేశామని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ మేం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలవాలనుకుంటున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి అనుమతి కోసం అడిగామన్నారు. మాకు అపాయింట్‌మెంట్ కోసం అనుమతి వచ్చి ప్రధానితో చర్చించేదాకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని హెచ్చరించారు.

English summary
TNJAC employees confirmed that they are ready to strike, if government will not respond on Telangana issue. The said they will continuing Non Co-Operation. They urged CS for Prime Minister Manmohan Singh appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X