తెలంగాణలో ప్రభుత్వం ఏది: భాజపా నేత విద్యాసాగర్ రావు

తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మంత్రులు అందరూ కూడా దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాటలో నడవాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోరారు. జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు కోదండరామ్ చెప్పారు. అయితే ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి కాకుండా గవర్నర్ నరసింహన్‌కు తన రాజీనామాను ఇవ్వాలని ఆయన కోరారు.
ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావుకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఆయన ముందుగా రాజీనామా చేసి మిగిలిన వారి గురించి మాట్లాడితే బావుండేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బిల్లు పెట్టే వరకు తెలంగాణ ప్రజలు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తారని హెచ్చరించారు. ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టి కేంద్రం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications