హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్పోరెట్ కళాశాలల కుట్రతోనే పరీక్షల నిర్వహణ: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: ప్రభుత్వం మొండి వైఖరితో పరీక్షలను నిర్వహించాలని చూస్తుందని, తెలంగాణవాదుల మిలియన్ మార్చ్ సందర్భంగా ప్రభుత్వం వెంటనే పరీక్షలను వాయిదా వేసుకోవాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శుక్రవారం అన్నారు. కోదండరామ్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మార్చి 10న జరిగే మిలియన్ మార్చ్‌కు తెలంగాణ ప్రజలంతా తరలి రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ కోసం ఒత్తిడి తేవడానికి తెలంగాణ ప్రరజలంతా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో వెళితే మనమూ ముందుకు వెళ్లాల్సిందేనన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును నష్టం చేసే దిశలో తెలంగాణవాదుల చర్యలు ఉన్నాయన్నట్టు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వాయిదా వేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. మేం పరీక్షలు రద్దు చేయమని అడగడం లేదని, కేవలం వాయిదా వేయమని మాత్రమే అడుగుతున్నామన్నారు. ఇంతకుముందు పరీక్షలు 15వ తేది నుండి ప్రారంభమయ్యేయని, గత ఏడాది నుండి 7వ తారీఖునుండి ప్రారంభిస్తున్నారన్నారు. కార్పోరేట్ కళాశాలలతో కుమ్మక్కయి ప్రభుత్వం పరీక్షలను ముందు నిర్వహిస్తోందన్నారు.

English summary
Telangana Political JAC chairman Kodandaram demanded state government today to postpone intermediate exams today. He accused government decision on exams date. He said some corporate colleges gaining with government activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X